వ్యంగ్యాస్త్రం ఎవరిపై?
టపా శీర్షిక, ప్రస్తుత ఎన్నికల రాజకీయ పరిస్థితులకు లింకేసుకొని ఇదేదో వాడి వేడి చర్చలకు రచ్చబండ అనుకునేరు, ఇది ఫక్తు వినోదాత్మక కేంద్రం మాత్రమే. దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం యూట్యూబులో పోకిరి, బొమ్మరిల్లువంటి చిత్రాలపై కొందరు ఔత్సాహికులు తీసిన వ్యంగ్యచిత్రాలని చూసినప్పటి నుండి యూట్యూబులో అప్పుడప్పుడు అలాంటి వాటికోసం వెతికి చూడడం అలవాటు. ఈ మధ్య ఇటువంటి చలనచిత్రాల సంఖ్య పెరిగి ఇటువంటి చిత్రాల విడుదల మన కన్నుగప్పే ప్రమాదం వున్నందున అన్నింటిని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ బ్లాగు.
ఇట్లు
కన్నగాడు
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి